📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణYadadri Bhuvanagiriచెరువుగట్టు రామ లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

చెరువుగట్టు రామ లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

📰 Generate e-Paper Clip

*చెరువుగట్టు రామ లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్…*


*ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య.*


*సెప్టెంబర్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*


నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చెరువు గట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య సోమవారం రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి , అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి నిర్వ హించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బీర్ల అయిలయ్య వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య  రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో , ఆయు రారోగ్యాలతో ఉండాలని, ఆలేరు నియోజకవర్గ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
చెరువుగట్టు రామ లింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.