*చెరువుగట్టు రామ లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్…*
*ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య.*
*సెప్టెంబర్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*
నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చెరువు గట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య సోమవారం రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి , అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి నిర్వ హించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బీర్ల అయిలయ్య వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో , ఆయు రారోగ్యాలతో ఉండాలని, ఆలేరు నియోజకవర్గ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
చెరువుగట్టు రామ లింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
