వినాయక మండపాల్లో రవి ముదిరాజ్ ప్రత్యేక పూజలు
నిర్వాహకులకు, డివిజన్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ అసోసియేషన్ల ఆహ్వానం మేరకు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం అధ్యక్షులు జి. రవి ముదిరాజ్ గుండ్ల పోచంపల్లి, కండ్లకొయ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. మండపాల వద్ద నిర్వాహకులు, యువతతో ఆయన ముచ్చటించారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం రవి ముదిరాజ్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు, యువతకు, డివిజన్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో డివిజన్‌కు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ అసోసియేషన్ సభ్యులు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

