రబీ సీజన్ పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి లైవ్ వెబ్‌కాస్ట్
– జమ్మికుంట కేవీకేలో రైతులకు ప్రత్యక్ష ప్రసారం
జమ్మికుంట సెప్టెంబర్ 13 (ప్రజావాణి )
జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలోకేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ లైవ్ వెబ్‌కాస్ట్ కార్యక్రమాన్ని, స్థానిక రైతులకు శనివారం రోజున ప్రత్యక్ష ప్రసారం చేశారుఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు పురుష, మహిళా రైతులు ఆసక్తిగా పాల్గొని ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ రాబోయే రబీ సీజన్‌కు సంబంధించి వ్యవసాయంలో పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు మరియు మార్గదర్శకాలను రైతులకు వివరించారు. రబీ సీజన్‌లో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే పంట వంగడాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలనివిత్తనశుద్ధిని తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారుఅలాగే నేల పరీక్షల నివేదికల ఆధారంగానే సమతుల్య ఎరువులను వాడాలని వనరులను పొదుపుగా వాడుకుంటూ సహజ వ్యవసాయం జల సంరక్షణ పద్ధతులను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ వంటి పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వెబ్‌కాస్ట్ అనంతరం రైతులు ఎదుర్కొంటున్న పలు సందేహాలకు కేవీకే శాస్త్రవేత్తలు తగిన సమాధానాలు ఇచ్చి నివృత్తి చేశారుఈ కార్యక్రమంలో కేవీకే ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ వివిధ విభాగాల విషయ నిపుణులు సిబ్బంది పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

