📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణMedchal-Malkajgiriమట్టి వినాయకుడిని ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.....ఘట్కేసర్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల...

మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం…..ఘట్కేసర్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ….పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని పిలుపు

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, సెప్టెంబర్‌ 13 (ప్రజా వాణి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఘట్కేసర్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఘట్కేసర్ బస్‌స్టాప్‌ వద్ద లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు.

వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా భక్తులచే ఆరాధించబడతాడని, గణేశుడి పూజతో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల వినియోగాన్ని తగ్గించి, సులభంగా నీటిలో కలిసిపోయే మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా చెరువులు, నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడవచ్చని తెలిపారు. భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణ హితమైన విధానంలో గణేష్‌ చవితి వేడుకలను నిర్వహించాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో చార్టర్డ్‌ లయన్‌ సారా శ్రీనివాస్‌ గౌడ్‌, మారం లక్ష్మారెడ్డి, బచ్చు నగేష్‌ గుప్తా, సగ్గు వేణుమాధవ్‌, లంబ సత్యనారాయణ, రామ్మోహన్‌, రాఘవేందర్‌, నర్సింగ్‌రావు, హిమబిందు, బోగ లక్ష్మి, మమత శర్మ, శంకర్‌రెడ్డి, ఆంజనేయులు, విక్రాంత్‌రెడ్డి, తాలూకా రాములు, అంజి తదితరులతో పాటు పలువురు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.