మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం…..ఘట్కేసర్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ….పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని పిలుపు

ఘట్కేసర్, సెప్టెంబర్‌ 13 (ప్రజా వాణి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఘట్కేసర్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఘట్కేసర్ బస్‌స్టాప్‌ వద్ద లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా భక్తులచే ఆరాధించబడతాడని, గణేశుడి పూజతో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌...