యువజన సంఘాల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
బెజ్జంకి, సెప్టెంబర్ 13 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు సొమ్ము అజయ్ వర్మ (కొండాపూర్ సర్పంచ్), బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, యువజన సంఘాల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ, భూ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని నిర్వాహకులు కోరారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, యువజన సంఘాల ప్రతినిధులు, ఉపసర్పంచ్ మహేష్, పలువురు యువకులు తదితరులు పాల్గొన్నారు.

