పారిశుద్ధ్య కార్మికులకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
గుండ్లపోచంపల్లిలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముదిరాజ్ హాజరై పారిశుద్ధ్య కార్మికులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఆయనతో పాటు గుండ్లపోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బేరిఈశ్వర్, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు గడీల కృష్ణారెడ్డి, ఆలయ సభ్యులు సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాల వినియోగంతో నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
RELATED ARTICLES

