సుతరిగూడ వద్ద విషాదం.. ఆటో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుతరిగూడ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గండిమైసమ్మ నుంచి మేడ్చల్ చెక్‌పోస్ట్ వైపు ఆటోలో వెనుక కూర్చొని ప్రయాణిస్తున్న సమయంలో వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. మృతుడిని ఎవరైనా గుర్తుపడితే వెంటనే మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

