📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaఅంగడిపేట హరిజన వాడలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ, ముత్యాలమ్మ బోనాల జాతర

అంగడిపేట హరిజన వాడలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ, ముత్యాలమ్మ బోనాల జాతర

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామ హరిజన వాడలో బుధవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

*బోనాల సందడి:*
బుధవారం ఉదయం నుండే హరిజన వాడలో పండుగ వాతావరణం. మహిళలు సంప్రదాయబద్ధంగా కొత్త చీరలు ధరించి, తలపై బోనం కలశాలు ఎత్తుకుని, పసుపు కుంకుమలతో డప్పు దరువులు, డీజే పాటలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా ఆలయాలకు చేరుకున్నారు. హరిజన వాడలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి, శ్రీ ముత్యాలమ్మ తల్లికి మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. అర్చకులు ఇరు అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, ఊరేగింపు జరిగింది. తమ కుటుంబాలు సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని భక్తులు మొక్కుకున్నారు.

*భారీగా భక్తులు:*
ఈ బోనాల జాతరకు అంగడిపేట తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, చిన్నారులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.