జేసీబీ కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి..
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..
ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు కోనేరు రమేష్ డిమాండ్..
పలాస ప్రజావాణి ప్రతినిధి
మెలియాపుట్టి మండలం
సవర చీపురుపల్లిలో గిరిజన కుటుంబానికి చెందిన నిర్మాణాలను జేసీబీతో కూల్చివేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు కోనేరు రమేష్ డిమాండ్ చేశారు.
మందసలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ వివాదాలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలే తప్ప, నిర్మాణాలను కూల్చివేయడం సరికాదన్నారు.
కూల్చివేతకు ముందు బాధిత కుటుంబానికి నోటీసులు ఇచ్చారా? అధికారుల అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై విచారణ జరపాలని కోరారు.
బాధిత సవర సోంబురు కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, ప్రత్యామ్నాయ స్థలం, పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం..అని గిరిజన మహిళలు తెలిపారు.
కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని కోనేరు రమేష్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్, గ్రామ పెద్దలు, గిరిజన మహిళలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

