ఆర్. ఓ ప్లాంట్ ప్రారంభించిన కల్వకుంట్ల ఆదిత్య

డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి,సెప్టెంబర్ 8,ప్రజావాణి:
టి. ఆర్. యస్ పార్టీ ఆధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుమారుడు కల్వకుంట్ల ఆదిత్య సుమారు లక్ష యాబై వేలు విలువైన ఆర్. ఓ. ప్లాంట్ కురవి హైస్కూల్ లో మంగళవారం ప్రారంబించారు.
అంతకుముందు ఆదిత్య కు
కొరవికి చెందిన సంగెం హర్షిత్, కేశరాజు రాజేష్ గౌడ్ లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు అనంతరం
శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కురవి హై స్కూల్ లోని త్రాగునీరు ఆర్ఓఆర్ ప్లాంటును ఆయన ప్రారంభించారు
ఈ సందర్బంగా ఆయన పాఠశాల విధ్యార్దులతో ముచ్ఛటించి మునుముందు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆన్నారు.
పిల్లలకు ప్యూరిఫైడ్ త్రాగు నీరు ఆందించడం తనకు ఆనందంగా ఉందని ఆయన ఆన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జెల కార్తీక్,దాసు, కత్తివినయ్, సంతోష్ దిలీప్ సాయి తదితరులు పాల్గొన్నారు

