📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyఅల్లవాడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం

అల్లవాడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం

📰 Generate e-Paper Clip

అల్లవాడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం…..
… అల్లవాడ గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్య వెల్లడి..
రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 6. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని అల్లవాడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని అల్లవాడ గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్య లు తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ప్రజావాణి బ్యూరో.తో
మాట్లాడుతూ తాను సర్పంచి పదవి చేపట్టినప్పటి నుండి గ్రామంలో గత పాలకులు చేయని పని ప్రగతి భవన్ నుండి డ్రైనేజీ పెద్ద గుమ్ములు వేసి వాటిపై సిసి రోడ్ వేసి రైతుల సమస్యలను తీర్చాలని అల్లవాడ గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్యలు. స్పష్టం చేశారు. అదేవిధంగా గ్రామంలో నిలకొన్న గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామము నుండి మురుగునీరు పంట పొలాల్లోకి వెళ్లి రైతులు పంటలు పండించుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ తాను జెసిబి సహాయంతో కాలువలను శుభ్రం చేసి వాటి నుండి పిచ్చి మొక్కలను తొలగించి రైతులు    ఎదుర్కొంటున్న సమస్యలను నేడు తమ సర్పంచ్ పదవి చేపట్టిన కొద్ది రోజులకి అట్టి సమస్యలను పరిష్కరించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామంలో అండర్ డ్రైనేజీ లేక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని గ్రామస్తుల విన్నపం తమ దృష్టికి రాగా . గ్రామంలో డ్రైనేజీ పనులుతమ సొంత నిధులతో జెసిబిల సహాయంతో పనులు చేపట్టినప్పటికీ అట్టి పలులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయని వెంటనే అట్టి పనులను కూడా పూర్తి చేస్తామని అల్లవాడ గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్యలు స్పష్టం చేశారు.  ఇంతవరకు ఎంపీ నిధుల తో అల్లవాడ గ్రామంలోని చిన్న హనుమాన్ దేవాలయం వరకు సిసి రోడ్డు వేయించానని సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్యలు. ధీమా వ్యక్తం చేశారు.అదేవిధంగా అల్లవాడ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన జాల గూడ  గ్రామంలో ఇప్పటివరకు వీధి దీపాలు వేయించామని ప్రస్తుత వర్షాకాలం దుష్టియన్ ఉంచుకొని  జాలగూడ గ్రామంలో గడ్డి మందు బ్లీచింగ్ పౌడర్. చల్లమని
దోమల కాటుకు మందులను  పిసికారి చేయించామని గ్రామ సర్పంచ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అల్లవాడ గ్రామపంచాయతీ మరియు దాని అనుబంధ గ్రామం జాలగూడ గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత చాలా ఉందని తను అల్లవాడ గ్రామంలో తన సొంత డబ్బులు అనగా వేరే వ్యక్తుల దగ్గర అప్పులు చేసి డ్రైనేజీ పనులు చేపట్టినప్పటికీ అప్పులు కట్టలేకపోయే పోయే పరిస్థితి దాపురించిందన్నారు
అల్లవాడ గ్రామాభివృద్ధికి చేవెళ్ల శాసనసభ్యులు కాల యాదయ్య చొరచూపాలి…..
అల్లవాడ దాని అనుబంధ గ్రామమైన  అల్లవాడ జాలగూడ. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు. ముఖ్యంగా  గ్రామాల్లో వీధి దీపాలు అండర్ డ్రైనేజీ పనులు సీసీ రోడ్లు. తదితరులాంటి చేపట్టాలంటే నిధులు అత్యవసరంగా అవసరమని  గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్యలు తెలిపారు. సర్పంచ్ పదవి చేపట్టినప్పటి నుండి అల్లవాడ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అనగా అండర్ డ్రైనేజీలు. మ్యానువల్. గ్రామాల పరిశుభ్రత. వీధి దీపాల ఏర్పాటు. తదితర లాంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో చేపట్టినప్పటికీ అప్పులు చేసి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించామని కనీసం తెచ్చిన  డబ్బులకు మిత్తి కట్టని పరిస్థితి దాపురించిందని సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్యలు పేర్కొన్నారు. ఇకనైనా చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య స్పందించి గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అల్లవాడ గ్రామ సర్పంచ్ జుట్టు  లావణ్య యాదయ్యలు చేవెళ్ల శాసనసభ్యులకు మొరపెట్టుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.