📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaభక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి వేడుకలు

భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి వేడుకలు

📰 Generate e-Paper Clip

భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి వేడుకలు

మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

45వ డివిజన్ లో గణేశుడి విగ్రహం వద్ద అన్న వితరణ కార్యక్రమం

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ పట్టణంలోని గణేష్ నవరాత్రి వేడుకలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నారని నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ పట్టణంలోని 45 డివిజన్ న్యూ ప్రకాశం బజార్ లో గల గణేశుడి విగ్రహం వద్ద గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమాన్ని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద భక్తుశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ఈ పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు. గణేష్ నవరాత్రి వేడుకలు, నిమజ్జనానికి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని తెలిపారు. నల్లగొండలో జరిగే గణేష్ నవరాత్రి వేడుకలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్ పున్న గణేష్ , గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పున్న సాయి కుమార్, పున్న విశ్వేశ్వర్, వి. లింగప్ప, వి. నాగరాజు, నారని బిక్షం, వనం యాదగిరి, వనం లక్ష్మీనర్సు, సి హెచ్. వెంకన్న, పున్న నరేశ్, చందు, సట్టు కిరణ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.