📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్తోకలపల్లి పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశం వైస్సార్సీపీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలి: ఎమ్మెల్సీ డీసీ...

తోకలపల్లి పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశం వైస్సార్సీపీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలి: ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

📰 Generate e-Paper Clip

* స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపు

పోరుమామిళ్ల, సెప్టెంబర్ 6: ప్రజావాణి గ్రామస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం పోరుమామిళ్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోరుమామిళ్ల మండలం తిమ్మారెడ్డిపల్లె పంచాయతీ తోకలపల్లి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు, పంచాయతీ ప్రెసిడెంట్ కాటసాని రమణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని, పార్టీ నియోజకవర్గ యువ నాయకుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తోకలపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పార్టీ పరిస్థితులు,ప్రజల సమస్యలు, స్థానిక రాజకీయాలపై ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నాయకులతో ఆత్మీయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.గ్రామాల్లో పార్టీ శ్రేణులను ఏకం చేస్తూ,సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ.నాయకులు,కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు.ఎమ్మెల్సీని కలిసిన వారిలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రాయపాటి సుబ్బారామిరెడ్డి,కాటసాని పోలిరెడ్డి,పోకాల సుబ్బారామిరెడ్డి,కె.ప్రసాద్,ఎం.కిరణ్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.