📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddy22ఏ ప్రభుత్వ తప్పిదం ప్రజలకు శాపం ఎంపీ రఘునందన్‌రావు

22ఏ ప్రభుత్వ తప్పిదం ప్రజలకు శాపం ఎంపీ రఘునందన్‌రావు

📰 Generate e-Paper Clip

•22ఏ ప్రభుత్వ తప్పిదం.. ప్రజలకు శాపం: ఎంపీ రఘునందన్‌రావు

•సింపోనీ పార్క్ హోమ్స్ బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది

•55 ఎకరాల హెచ్‌ఎండీఏ ఆమోదిత లేఅవుట్‌ను 22ఏలో చేర్చడం అన్యాయం

•నాడు హైడ్రా.. నేడు 22ఏ పేరుతో ప్రజలను వేధిస్తున్నారు

పటాన్‌చెరు, సెప్టెంబర్‌ 5 (ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గంలోని జేపీ కాలనీ డివిజన్ పరిధిలో ఉన్న సింపోనీ పార్క్ హోమ్స్ లో నెలకొన్న 22ఏ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్న అనంతరం ప్రజలు కొనుగోలు చేసిన ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమని ఆయన విమర్శించారు.
సింపోనీ పార్క్ హోమ్స్‌లో 22ఏ బాధితులను కలిసి ఎంపీ వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన సింపోనీ పార్క్ హోమ్స్ లేఅవుట్‌కు 2013లోనే హెచ్‌ఎండీఏ నుంచి ఫైనల్ లేఅవుట్ అనుమతులు లభించాయని తెలిపారు. సుమారు 10 సర్వే నంబర్ల పరిధిలో ఉన్న ఈ లేఅవుట్‌లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు పొందిన తరువాతే విల్లాల నిర్మాణం, విక్రయాలు జరిగాయని పేర్కొన్నారు.
హెచ్‌ఎండీఏ అనుమతులను పరిశీలించిన ప్రజలు తమ జీవితకాల సంపాదనతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని విల్లాలను కొనుగోలు చేశారని ఎంపీ తెలిపారు. కొనుగోలు సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని నమ్మిన ప్రజలు ఇప్పుడు 22ఏ నిషేధిత జాబితా కారణంగా తమ ఆస్తులపై హక్కులు, రిజిస్ట్రేషన్లు, విక్రయాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
“ప్రభుత్వ శాఖలే అనుమతులు ఇచ్చి.. ప్రజలు కొనుగోలు చేసిన తర్వాత అదే ఆస్తులను 22ఏలో చేర్చడం ఎలా సమంజసం? ప్రభుత్వ తప్పిదానికి అమాయక ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి?” అని రఘునందన్‌రావు ప్రశ్నించారు.
“22ఏ అనేది ప్రభుత్వ తప్పిదం.. ఆ తప్పిదానికి ప్రజలను బలిచేయడం దారుణం. రాత్రికి రాత్రే తీసుకునే నిర్ణయాలతో వేలాది కుటుంబాల భవిష్యత్తుతో చెలగాటమాడకూడదు” అని ఆయన మండిపడ్డారు. నాడు హైడ్రా పేరుతో, నేడు 22ఏ పేరుతో సామాన్య ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
పేదలకు ఒక న్యాయం, ధనికులకు మరో న్యాయం ఉండకూడదని స్పష్టం చేసిన ఎంపీ, సింపోనీ పార్క్ హోమ్స్ 22ఏ బాధితుల పక్షాన బీజేపీ పూర్తిస్థాయిలో పోరాడుతుందని హామీ ఇచ్చారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే బాధితులతో కలిసి ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.
హెచ్‌ఎండీఏ ఆమోదించిన లేఅవుట్‌లో ఆస్తులు కొనుగోలు చేసిన యజమానుల హక్కులను ప్రభుత్వం కాపాడాలని, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం లేదా గతంలో జరిగిన తప్పిదాల భారాన్ని ప్రజలపై మోపకూడదని రఘునందన్‌రావు అన్నారు.
కార్యక్రమంలో సింపోనీ పార్క్ హోమ్స్ 22ఏ బాధితులు, బీజేపీ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.