కొర్రెముల, సెప్టెంబర్ 4: కొర్రెముల గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని నాయబ్ తహసీల్దార్ చంద్రశేఖర్ పరిశీలించారు. గ్రామంలో సిబ్బంది నిర్వహిస్తున్న వివరాల సేకరణ, ఓటర్ల వివరాల పరిశీలన ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, ఇప్పటికే నమోదైన ఓటర్ల వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఆ గ్రామ ప్రజలు ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించి, తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని నాయబ్ తసిల్దార్ చంద్రశేఖర్ కోరారు. చిరునామా మార్పు, పేరు లేదా ఇతర వివరాల్లో సవరణలు అవసరమైతే నిర్ణీత ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రవితేజ, జీపీఓ వెంకటేష్, సత్యనారాయణ,ప్రవీణ్, అన్నపూర్ణ, సంబంధిత సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

