📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJayashankar Bhupalpallyసుకన్య యోజన క్రింద జమ చేసి అండగా నిలిచారు...

సుకన్య యోజన క్రింద జమ చేసి అండగా నిలిచారు…

📰 Generate e-Paper Clip

 

 

గోరి కొత్తపల్లి మండల గ్రామానికి చెందిన కట్ల సతీష్ ఇటీవల చేపలు పడుతున్న క్రమంలో కాలికి వల చిక్కుకొని అకాల మరణం చెందరు. కాగా నిరుపేద కుటుంబానికి చెందిన సతీష్ పరిస్థితిని తెలిసిన పలువురు వారి ఇరువురు కూతుర్ల పేర్ల మీద నగదు జమ చేశారు.

 

గోరి కొత్తపల్లి గ్రామస్థులు, వారి కుటుంబ సభ్యులు(కట్ల) రూ.75,000 లను సతీష్ పెద్ద కూతురు అవిగ్న పేరు మీద సుకన్య యోజన క్రింద జమ చేసి అండగా నిలిచారు.

 

అలాగే కట్ల వెంకటేష్ &తోటి కానిస్టేబుల్స్, ముదిరాజ్ కుల సోదరులు సతీష్ చిన్న కూతురు పేరు నిహాన్సిక మీద రూ.65,000 నగదు జమ చేసి, అండగా నిలిచారు.

ఈ నగదు జమ చేసిన బుక్కులను సతీష్ కుటుంబ సభ్యులు (భార్య మౌళిక )కు అందజేసి, అండగా ఉంటామని భరోసా కల్పించి, దైర్యం చెప్పారు.

 

సహకరించిన దాతలు అందరికీ సతీష్ కుటుంబ సభ్యులు భార్య మౌళిక , సతీష్ అన్న నాగరాజు మానస లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో పల్లెభోయిన నవీన్, కట్ల నాగరాజు(కారోబార్) ,పుట్ట రాంబాబు, నెల్లి వేణు,కట్ల వెంకటేష్, కట్ల కోటి, పకిడే నవీన్, యాట సతీశ్,మేకల ఓదెలు, నెల్లి రమేష్, యాట కృష్ణ మూర్తి, కట్ల రాజ్ కుమార్, కట్టు గోకుల్, మునిగాల నాగరాజు, కట్ల రమేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.