బీసీ మహిళలకు ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం.
15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఎల్కతుర్తి ఎంపీడీవో విజయ్ కుమార్.
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటింటికి ఇందిరమ్మ కుట్టుమిషన్ పథకం కింద అర్హులైన బీసీ మహిళల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు.బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ పథకం ద్వారా కుట్టుమిషన్లు అందించనున్నట్లు పేర్కొన్నారు.అర్హత ఉన్న మహిళలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ నెల 15వ తేదీ లోపు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అని తెలిపారు.అర్హులైన మహిళలు గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకొని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు ఫోటోతో పాటు రెండు జిరాక్స్ ప్రతులను సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి కి ఇవ్వగలరని తెలిపారు.

