📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaవర్షం కోసం వినూత్న మొక్కు: దేవుళ్లకు నీళ్లు పోసి, వరదపాశం పట్టి ప్రార్థించిన అంగడిపేట వాసులు

వర్షం కోసం వినూత్న మొక్కు: దేవుళ్లకు నీళ్లు పోసి, వరదపాశం పట్టి ప్రార్థించిన అంగడిపేట వాసులు

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామం లో ఇరిగి రామన్న ఆద్వర్యంలో వర్షం కురవాలనే గంపెడాశతో అంగడిపేట 4, 5 వార్డుల ప్రజలు దేవుళ్లకు నీళ్లు పోసి, వరదపాశం (వరుణ పాశం) అనే ప్రత్యేక పూజ నిర్వహించారు.

కప్ప పెళ్లి వేడుక తర్వాత కూడా మరింత వర్షం కురవాలని, పంటలు బాగా పండాలని వారు ఈ సంప్రదాయ పూజ చేశారు. వారి భక్తికి మెచ్చి వరుణుడు కరుణిస్తాడని స్థానికులు చెబుతున్నారు.

*ఏం చేశారు?*

– గ్రామంలోని దేవాలయంలో దేవుళ్ల విగ్రహాలకు నీళ్లు పోసి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు
– పెద్దలు చెప్పిన పద్ధతిలో వరదపాశం / వరుణ జపం చేసి, వర్షం కురవాలని మొక్కుకున్నారు.
– “వర్షం పడుతుంది” అనే బలమైన నమ్మకం.

“దేవుళ్లకు నీళ్లు పోస్తే, దేవుడు మనకు వర్షపు నీళ్లు ఇస్తాడు అనేది మా పెద్దల నమ్మకం” అని 4, 5 వార్డుల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంప్రదాయ ఆచారం, ప్రజల ఐక్యత చండూర్ మున్సిపాలిటీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో 4, 5 వార్డుల కౌన్సిలర్ల్ జెల్ల ధనమ్మ శ్రీను, కొండ్రెడ్డి మధు, గ్రామ పెద్దలు, సిలువేరు బిక్షపతి, సిలువేరు రాజు, మహిళలు, చిన్నారులు, రైతులు అందరూ కలిసి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.