వర్షం కోసం వినూత్న మొక్కు: దేవుళ్లకు నీళ్లు పోసి, వరదపాశం పట్టి ప్రార్థించిన అంగడిపేట వాసులు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామం లో ఇరిగి రామన్న ఆద్వర్యంలో వర్షం కురవాలనే గంపెడాశతో అంగడిపేట 4, 5 వార్డుల ప్రజలు దేవుళ్లకు నీళ్లు పోసి, వరదపాశం (వరుణ పాశం) అనే ప్రత్యేక పూజ నిర్వహించారు. కప్ప పెళ్లి వేడుక తర్వాత కూడా మరింత వర్షం కురవాలని, పంటలు బాగా పండాలని వారు ఈ సంప్రదాయ పూజ చేశారు. వారి భక్తికి మెచ్చి వరుణుడు కరుణిస్తాడని స్థానికులు చెబుతున్నారు. *ఏం చేశారు?* - గ్రామంలోని దేవాలయంలో దేవుళ్ల...