టేకుమట్ల/ప్రజావాణి: భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం లో బీసీ ఎస్సీ ఎస్టీ- జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో MRO గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ ఎస్సీ ఎస్టీ – జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ నాయకుడు దాసరపు వర్ధన్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు రూ.14,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నది. ఈ ఫీజులు చెల్లించలేని దుస్థితి కారణంగా ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కళాశాలల్లో తమ చదువులను కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బకాయిలు ఆలస్యం కావడం వల్ల విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలిగి మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొందరు విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. మొత్తంగా ఈ ప్రభావం ఒక కోటి కుటుంబాలపై పడింది. ఇంతటి దుర్భర పరిస్థితిని బీసీ ఎస్సీ ఎస్టీ & పేద విద్యార్థులు ఎదుర్కొంటున్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి, విద్యార్థులు ఎటువంటి ఆటంకం లేకుండా తమ విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా అర్జెంటుగా ప్రభుత్వం కళాశాలలో చెల్లించే ఫీజుల తో నిమిత్తం లేకుండా విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యం ఆపకుండా వెంటనే ఇచ్చేలా ఒక GO ని విడుదల చేయాలి కోరాడు.ఈ కార్యక్రమంలో ఎం జె ఎస్ భూపాలపల్లి జిల్లా కన్వినర్ పర్లపల్లి వంశీ బీసీ ఎస్సీ ఎస్టీ – జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పవన్ తిరుపతి పాల్గొన్నారు.
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి
RELATED ARTICLES

