పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

టేకుమట్ల/ప్రజావాణి: భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం లో బీసీ ఎస్సీ ఎస్టీ- జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో MRO గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ ఎస్సీ ఎస్టీ - జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ నాయకుడు దాసరపు వర్ధన్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు రూ.14,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నది. ఈ ఫీజులు చెల్లించలేని దుస్థితి కారణంగా ముఖ్యంగా...