హైదరాబాద్ గట్టు సత్యనారాయణ, మంచికంటి శ్రీనివాస రావు పదవీ విరమణ శుభాకాంక్షలు
(ప్రజావాణి )ఆగస్టు 31 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్.
హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్
విభాగంలో 40 సంవత్సరాల సేవల తర్వాత శ్రీ గట్టు సత్యనారాయణ మరియు శ్రీ మంచికంటి శ్రీనివాస రావు పదవీ విరమణ సందర్భంగా సన్మానితులుగా నిలిచారు. ఈ కార్యక్రమం ఆగస్టు 31, 2026 న ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం, డిఎస్‌ఎస్ భవన్‌లో సాయంత్రం 5 గంటలకు జరిగింది.
ఈ సన్మాన కార్యక్రమంలో ప్రధాన ఇంజనీర్ ఎం. బాలు, హైదరాబాద్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ ఎ. హేమలత, వరంగల్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ ఆర్.డి. ఫణికుమారి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. గట్టు సత్యనారాయణ డ్రాఫ్ట్స్‌మ్యాన్ జిఆర్-IIగా, మంచికంటి శ్రీనివాస రావు అసిస్టెంట్ ఇంజనీర్‌గా సేవలు అందించారు.
