prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 7:33 am Digital Edition : MINIPALLYNARESH KUKATPALLY

హైదరాబాద్ గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ గట్టు సత్యనారాయణ, మంచికంటి శ్రీనివాస రావు పదవీ విరమణ శుభాకాంక్షలు

హైదరాబాద్ గట్టు సత్యనారాయణ, మంచికంటి శ్రీనివాస రావు పదవీ విరమణ శుభాకాంక్షలు

 

(ప్రజావాణి )ఆగస్టు 31 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్.

హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో 40 సంవత్సరాల సేవల తర్వాత శ్రీ గట్టు సత్యనారాయణ మరియు శ్రీ మంచికంటి శ్రీనివాస రావు పదవీ విరమణ సందర్భంగా సన్మానితులుగా నిలిచారు. ఈ కార్యక్రమం ఆగస్టు 31, 2026 న ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం, డిఎస్‌ఎస్ భవన్‌లో సాయంత్రం 5 గంటలకు జరిగింది.

ఈ సన్మాన కార్యక్రమంలో ప్రధాన ఇంజనీర్ ఎం. బాలు, హైదరాబాద్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ ఎ. హేమలత, వరంగల్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ ఆర్.డి. ఫణికుమారి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. గట్టు సత్యనారాయణ డ్రాఫ్ట్స్‌మ్యాన్ జిఆర్-IIగా, మంచికంటి శ్రీనివాస రావు అసిస్టెంట్ ఇంజనీర్‌గా సేవలు అందించారు.