📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్24వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్‌చార్జి శ్రీ మంచూరు సూర్యనారాయణ...

24వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్‌చార్జి శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి

📰 Generate e-Paper Clip

బద్వేల్ ఆగస్టు 31 ప్రజావాణి నియోజకవర్గం, బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు వెంకటయ్య నగర్‌లో నిర్వహించిన డోర్ టు డోర్ (D2D) కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు స్థానిక కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.