📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabad21 ఏళ్లు పూర్తి చేసుకున్న కోటగిరి మండల సమాఖ్య.

21 ఏళ్లు పూర్తి చేసుకున్న కోటగిరి మండల సమాఖ్య.

📰 Generate e-Paper Clip

21 ఏళ్లు పూర్తి చేసుకున్న కోటగిరి మండల సమాఖ్య.

సవరించిన బైలా ప్రకారం కోటగిరి మహిళా సమాఖ్య మహాజన సభ.

మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా ఎం.సుజాత మరోమారు ఏకగ్రీవంగా ఎన్నిక.

కార్యదర్శిగా ఎం.భాగ్యశ్రీ,కోశాధికారిగా ఎం.గంగాలత ఎన్నిక.

ఆర్టీసీ బస్సు కొనుగోలుతో కోటగిరి మహిళా సమాఖ్య ప్రగతి.

100 శాతం రికవరీ,సైబర్ అవగాహన,డిజిటల్ బుక్ కీపింగ్ లక్ష్యంగా కోటగిరి సమాఖ్య తీర్మానాలు.

నిరుపేద మహిళలకు మహిళా సంఘాల్లోకి ఆహ్వానం.

 

కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గం ఉమ్మడి కోటగిరి మండల మహిళా సమాఖ్య 21 వ వార్షిక మహాజనసభ సోమవారం సవరించిన బైలా ప్రకారం పలు చర్చలు, తీర్మానాల మధ్య కొనసాగింది.ఈ వార్షిక మహాజన సభ ఏపీఎం జి.భాస్కర్ సమక్షంలో నూతనంగా ఎన్నుకోబడిన మండల మహిళా సమాఖ్య అధ్యక్షురా లు ఎం.సుజాత అధ్యక్షతన,కార్యదర్శి ఎం.భాగ్యశ్రీ,కోశాధికారి ఎం.గంగాలత,కార్యవర్గ సభ్యులతో మహాజన సభ సజావుగా కొనసాగింది.ఈ సభకు ఉమ్మడి మండలంలో ఉన్న అన్ని గ్రామ సంఘాల నుండి ఇద్దరు చొప్పున అధ్యక్ష,కార్యదర్శిలు హాజరయ్యారు.ఈ సందర్భం గా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎం.సుజాత,ఏపీఎం జి.భాస్కర్ మాట్లాడుతూ.కోటగిరి మండల సమాఖ్యను ఏర్పాటు చేసి నేటికి 21 సం.లు పూర్తి చేసుకోవడం అభినందనీయమని అన్నారు.మండల సమాఖ్యకు సంబంధించిన ఆడిట్ రిపోర్టుకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు.అలాగే 2026-27 సం.నికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.అందులో భాగంగా రికవరీ పర్సంటేజ్ ను నూటికి నూరు శాతం సాధించాలని,అలాగే సంఘాలలో లేనటువంటి నిరుపేద మహిళలను సంఘంలో చేర్చుకునేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు.గత వార్షిక సం.లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మండల సమాఖ్యలకు ఆర్టీసీ బస్సుల కొనుగోలు కొరకు రూ.30 లక్షలు ఇవ్వగా కోటగిరి మండల సమాఖ్య ద్వారా రూ.6 లక్షల కాంట్రిబ్యూషన్ తో కలిపి మొత్తం రూ.36 లక్షల తో ఆర్టీసీ బస్సును కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించడం జరిగిందని తెలిపారు.ఈ ఆర్టీసీ బస్సు ద్వారా మండల సమాఖ్యకు ప్రతి నెల అసలు,వడ్డీ రూపంలో రూ.69,840 వస్తున్నాయని.ఈ నిధులలో 50 శాతం ఫిక్స్ డిపాజిట్ రూపంలో ఉంచి మిగతా 50 శాతం మండల సమాఖ్య కార్యక్రమాల నిర్వహణకు ఖర్చులు చేస్తున్నామని తెలిపారు.కోటగిరి మండలంలో ఉన్న ప్రతి మహిళ సైబర్ నేరాల బారిన పడకుండా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలని.అలాగే ప్రతి మహిళ తీసుకున్న అప్పులను సక్రమంగా చెల్లించే విధంగా డిజిటలైజేషన్,బుక్ కీపింగ్ నిర్వహణను పెంచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని అన్ని గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు తీర్మానం చేశారని పేర్కొన్నారు.2025-26 రిపోర్టు ఆధారంగా కోటగిరి మండల సమాఖ్య ఆదాయం,ఖర్చులు, శిక్షణ,నిర్వహణ ఖర్చులు అన్నీ పోను రూ.1,81,000 లాభం వచ్చినట్లు వారు తెలియజేశారు.ఈ సమావేశంలో కోటగిరి మండల సర్పంచుల ఫోరం కన్వీనర్ బర్ల మధుకర్,కోటగిరి మండల ఎంపీడీవో జి.విష్ణు,మండల మహిళా సమాఖ్య కార్యదర్శి భాగ్యశ్రీ,కార్యవర్గ సభ్యులు,సీసీలు సాయిబాబా,నాగరాజు, రమేష్,నాగలక్ష్మి,సుజాత,అకౌంటెంట్ రాజు,ఆయా గ్రామ సంఘాల అధ్యక్షులు,కార్యదర్శులు,వివోఏలు,ఐకేపీ సిబ్బంది,మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.