*అంతర్జాతీయ స్థాయిలో కళలకు, కళాకారులకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం*
*జర్నలిజంలో జాడ క్రాంతి కుమార్ కు జాతీయ పురస్కారం*
*మన ప్రజావాణి*మందమర్రి ఆగస్టు 31
స్థానిక కళలను, కళాకారులను గుర్తించి, వారికి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా తెలుగు సాంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ కృషి చేస్తున్నాయని సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మాచవరం గౌరీ శంకర్ తెలిపారు. తెలుగు సాంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని ది సిటీ పార్క్ హోటల్ లో నిర్వహించిన జాతీయ పునస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు, సాహితీవేత్తలు, సామాజిక సేవకులు, జర్నలిస్టులు, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారులను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులను వివిధ పురస్కారాలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పలువురికి సొసైటీ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేశారు. ఈ వేడుకల్లో జర్నలిస్టుల విభాగంలో మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన జాడ క్రాంతి కుమార్ (టైమ్స్ ఆఫ్ వార్త)కు జాతీయ పురస్కారం –2026ను ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు. జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్న క్రాంతి కుమార్‌ను పలువురు జర్నలిస్టులు, మిత్రులు, స్థానికులు అభినందించారు.ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ, తనకు లభించిన ఈ గౌరవం మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియజేసేలా నిజాలను వెలికితీసి, నిష్పక్షపాత సమాచారాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి సాహితీ సామ్రాట్ సూరేపల్లి విజయ తో నిర్వాహకులు మాచవరం గౌరీశంకర్, మాచవరం నరసింహ సాయి శ్రీనివాస్ లు పాల్గొన్నారు..
అంతర్జాతీయ స్థాయిలో కళలకు, కళాకారులకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం
RELATED ARTICLES

