📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadఅన్ని వర్గాల ఐక్యమత్యంతోనే రాజ్యాధికారం సాధ్యం

అన్ని వర్గాల ఐక్యమత్యంతోనే రాజ్యాధికారం సాధ్యం

📰 Generate e-Paper Clip

అన్ని వర్గాల ఐక్యమత్యంతోనే రాజ్యాధికారం సాధ్యం

ఐక్య ఉద్యమాలతో బీసీలు రాజకీయంగా ఎదగాలి

డాక్టర్ కూరపాటి రమేష్

 

భారతదేశంలోనే 80 శాతానికి పైగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించాలని కూరపాటి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కురపాటి రమేష్ అన్నారు. ఆదివార తొర్రూరు లో జేఏసీ ఆహ్వాన కన్వీనర్ అనపురం వెంకన్న గౌడ్ అధ్యక్షతన, తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథిగా వివిధ బీసీ సంఘాల ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు ఐక్య సమావేశ బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్ హాజరు కావడం జరిగినది. ఈ వేదిక బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో సబ్బండ కులాల ఐక్యవేదిక నాయకుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుండి గ్రామాల నుండి వివిధ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుల సంఘ నాయకులందరూ పాల్గొన్నారు వచ్చే సెప్టెంబర్ నెలలో జరగబోయే బీసీ రాజ్యాధికార సంకల్ప సభను దిగ్విజయం చేయుట కొరకు సన్నాక సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ 90 శాతం కలిగిన వారు ఒకే భావజాలాన్ని కలిగి ఉండి ఏకతాటిపై ఉండి నిర్మాణం చేసినట్లయితే భవిష్యత్తులో బీసీల బహుజనుల రాజ్యాధికారము సహకారం అవుతుందన్నారు. మనమెంతో మనకంత వాటాను భవిష్యత్తులో అన్ని స్థాయిలలో తీసుకునే అవకాశం ఉంటుందని వారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో, ప్రభుత్వ విద్యావ్యవస్థ లు, హాస్పిటల్స్ వైద్య రంగాలు సంక్షేమ రంగాలలో అసమానతలు అన్ని రకాలుగా నిర్వీర్మైపోయాయని బడుగు బలహీన వర్గాల బహుజనులకు అందుబాటులో లేవని, పాలకుర్తి నియోజకవర్గం గత స్వాతంత్రం నుండి అగ్రవర్ణాల చేతిలోనే ఉండి వారి ఆధీనంలోనే అణచివేత ధోరణితో బిసి బహుజన్ లను ఎదగా నివ్వకుండా వారు చెప్పు చేతుల్లోనే ఉంచుకుంటూ అందర్నీ బానిసలుగా రాజకీయ చైతన్యం లేకుండా చేశారని వాపోయారు.ఈ కార్యక్రమంలో బండి పుల్లయ్య ఎక్స్ ఎమ్మెల్యే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చందా మల్లయ్య చైర్మన్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా దామార ఉపేందర్ తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ రాజ్. చామకూర్ ఐలయ్య, సిరి స్వచ్ఛంద సంస్థ శ్రీనివాస్, దళిత నాయకుడు అయిలయ్య, కోట వెంకటేశ్వర్లు, రాంపాక సుధాకర్, దొనకల్ ఐలయ్య, రాయిశెట్టి ఉపేందర్ లతోపాటు మండలాల నుండి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.