📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆటో.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆటో.. ఇద్దరికి తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

 

163వ జాతీయ రహదారిపై ప్రమాదం – పరిస్థితి విషమం

పసర( ప్రజావాణి)

పసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 163వ జాతీయ రహదారిపై రాత్రి సుమారుగా 8 గంటల 10 నిమిషాలకు శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో పసర గ్రామానికి చెందిన బషీర్, ముద్దులగూడెం గ్రామానికి చెందిన గడ్డి యాదయ్య తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద తీవ్రతతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పసర పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.