📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriనిజాంపేట్‌లో స్కిన్ అటెలియర్డె ర్మటాలజీ క్లినిక్ ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

నిజాంపేట్‌లో స్కిన్ అటెలియర్డె ర్మటాలజీ క్లినిక్ ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

📰 Generate e-Paper Clip

నిజాంపేట్‌లో స్కిన్ అటెలియర్డె ర్మటాలజీ క్లినిక్ ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

నిజాంపేట్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి *దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు* నిజాంపేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “స్కిన్ అటెలియర్” డెర్మటాలజీ క్లినిక్‌ను ఘనంగా ప్రారంభించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ *తోటకూర వజ్రేష్ యాదవ్*  కుమార్తె డా. సరిత రాజ్ కుమార్ యాదవ్, డెర్మటాలజిస్ట్ ఆధ్వర్యంలో ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  డా. సరిత రాజ్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు నాణ్యమైన చర్మ వైద్య సేవలను అందించడంలో “స్కిన్ అటెలియర్” క్లినిక్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

డెర్మటాలజీ రంగంలో ఆధునిక వైద్య విధానాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో “స్కిన్ అటెలియర్” క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు డా. సరిత రాజ్ కుమార్ యాదవ్ తెలిపారు. చర్మ సంబంధిత సమస్యలకు నిపుణులైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా క్లినిక్‌ను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.

క్రమంలో తోటకూర వజ్రేష్ యాదవ్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని డా. సరిత రాజ్ కుమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.