రైతులకు కన్నీరు… భారీగా పడిపోయిన వర్షపాతం….
….. రైతులపై ఎల్ నీ నో ప్రభావం.
…… జిల్లాలో భారీగా తగ్గిన వర్షపాతం..
….. ఖరీఫ్ సాగుకు తప్పని తిప్పలు..
రంగారెడ్డి జిల్లా బ్యూరో. ఆగస్టు 27. ప్రజావాణి. వర్షాకాలం వచ్చిందంటే రైతుల కళ్ళల్లో ఆనందం వెళ్లి విరుస్తుంది. పొలాలు దున్ని విత్తనాలు చల్లి పచ్చని పంటల కోసం ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సంవత్సరం వరుణ దేవుడు కన్నెర్ర చేశాడు. ఋతుపవనాలు ముఖం దాటేశాయి. దేశవ్యాప్తంగా వర్షాలతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వర్షపాతం ఏకంగా పడిపోవడంతో ఖరీఫ్ సాగుకు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వర్షాభావ సంక్షోభం రైతులను తీవ్రంగా బాధిస్తుంది. ప్రత్యామ్నాయ స్వల్పకాలిక పంటల వైపు మల్లాల్సిన పరిస్థితులకు దాపురించాయి. నైరుతి రుతుపవనాలు ఈ జూన్ నెల ప్రారంభంలో కాస్త ఆశలు రేకెత్తించిన ఆ తర్వాత క్రమంగా బాగా బలహీన పడ్డాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం పడిపోయింది. ముఖ్యంగా మధ్య భారతదేశం లో వర్షాదారిత ప్రాంతాల రైతులు తీవ్ర నిరాశలో కురుకుపోయారు. వర్షాలు సమృద్ధిగా పడకుపోవడంతో వరి పత్తి నూనె గింజలు పప్పు ధాన్యాలు సాగు భారీగా ఆలస్యం రైతు తమ పంట పొలాల్లో సాగు చేశారు. మహారాష్ట్రలో అత్యధికంగా 82% వర్షపాతం
లోటు నమోదు కాగా జార్ఖండ్ లో 69 శాతం. చత్తిగడ్డలో 67%. లోటు ఉంది. మధ్యప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల్లోనూ సగానికి పైగా వర్షాలు తగ్గాయి. త్వరలో వర్షాలు ఊపందుకోకపోతే ఈ ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వానలు రాకపోవడంతో కరువు పరిస్థితులును ఎదుర్కొంటున్న రైతులు ప్రత్యమాలవైపు చూస్తున్నారు. తక్కువ సమయంలో చేతికి వచ్చే సోయాబీన్. మొక్కజొన్న క్యారెట్ బీట్రూట్, తదితర కూరగాయలు పంటలు. కంది పప్పు ధాన్యాల పంటలు రైతులు జిల్లాలో సాగు చేశారు. మహారాష్ట్ర. భరద్వాడా ప్రాంతాల్లో కంది పంట తక్కువ శాతం వేసేందుకు సన్నదమయ్యారని సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం వర్షాల కోసం ఆకాశం వంక చూస్తున్నారు. మరో రెండు వారాలు చూసి అప్పటికి వానలు పడకపోతే రైతులు వేసిన పంటలు పండవని తీవ్ర నష్టపోయామని జిల్లాలోని రైతులు ఆందోళనలు ఉన్నారు.
ఎల్ నీనో ప్రభావంతో ఒకవైపు వర్షాభావ పరిస్థితులు నెలకొంది…
కొన్ని రాష్ట్రాల్లో ఆచార్యకంగా అంచనాలను మించి వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్ 41%. ఆంధ్రప్రదేశ్లో మూడు శాతం. సాధారణ కంటే అదనంగా వర్షాలు కురిశాయి. పంజాబ్ హర్యానా రాష్ట్రంలో కాలువలు భూగర్భ జలాలు జలాల ఆధారంగా వరి నాట్లు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు మారుతాయని వాతావరణ శాఖ చెబుతుంది. జూన్ 23 నాటికి తెలంగాణ మహారాష్ట్ర ఒడిస్సా ఝార్ఖండ్ సహా పలు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించినందుకు అనుకూల వాతావరణం ఉందని ఐఎండి అంచనా వేసింది. ఎల్ నీ నో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ కూడా అప్రమతమైంది. తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్న ను 197 జిల్లాలను గుర్తించి అక్కడ రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక కంటిజన్స్ ప్లాన్ సిద్ధం చేసింది.
End…..
.
.
రైతులకు కన్నీరు… భారీగా పడిపోయిన వర్షపాతం
RELATED ARTICLES

