….
రంగారెడ్డి జిల్లా బ్యూరో. ఆగస్ట్ 27. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం స్పెషల్ ఇంటెన్షన్ రెబిషన్. ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందజేసిన అవసరమైన పత్రాలపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా బి ఎల్ ఓ లు మాట్లాడుతూ పోతుగల్ గ్రామ ప్రజలందరూ ఓటర్ నోటీసు కు అవసరమైన సరైన పత్రాలను జత చేసి సామూహిక బిఎల్ఓ గార్లకు అందజేయాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్షన్ రేవిషన్. ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సహకరించి తమ ఓటు హక్కు కు సంబంధించిన వివరాలను సక్రమంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోతుగల్ గ్రామ సర్పంచ్ పామేనా నర్సింలు. ఉపసర్పంచ్ నేరెట్ల సావిత్రి. గ్రామ వార్డు పాలకవర్గం
అంగన్వాడి టీచర్. ఆశా వర్కర్
గ్రామపంచాయతీ సెక్రటరీ అశోక్. గ్రామ యువజన సంఘాల సభ్యులు. గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
.


