టేకుమట్ల/ప్రజావాణి: టేకుమట్ల మండలంలోని కుందనపల్లి గ్రామంలో దేశెట్టి రాజేందర్–సంధ్య దంపతుల కుమారుడు విక్షన్ మొదటి పుట్టినరోజు వేడుకలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డిహాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి విక్షన్ను ఆశీర్వదించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆమె ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దేశెట్టి గోపాల్, మండల అధ్యక్షులు గుర్రపు నాగరాజ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి అజయ్, నాయకులు బట్ల మొగిలి, దేశెట్టి సునీల్ దేశెట్టి రమేష్, పెండ్యాల అనిల్, రాజేందర్, శంకర్, ప్రమోద్, అనిల్, రవి, ఉదయ్ కిరణ్, భాస్కర్, కుమార్, రామమోహన్ రావు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

