బదిలీ పై వెళ్తున్న సీఐ మల్లేష్ ను సన్మానించిన సర్కిల్ ఎస్సైలు
టేకుమట్ల /ప్రజావాణి:చిట్యాల మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గత రెండేళ్లుగా సీఐగా విధులు నిర్వహించిన దగ్గు మల్లేష్ బదిలీపై హైదరాబాద్ మల్టీజోన్-1కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం సర్కిల్ పరిధిలోని చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల ఎస్సైలు పోచంపల్లి సతీష్, నరేష్, అమూల్య ఆయనను సన్మానించారు.సీఐ మల్లేష్‌ను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. గుర్తుగా ఆయన చిత్రపటాన్ని బహూకరించారు. గత రెండేళ్లుగా సర్కిల్ పరిధిలో విధులు నిర్వహించిన ఆయన సేవలను ఈ సందర్భంగా ఎస్సైలు కొనియాడారు.సీఐ మల్లేష్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయడంతోపాటు ప్రజలతో మమేకమై పనిచేశారని తెలిపారు. తోటి ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేసి పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది మన్ననలు పొందారని పేర్కొన్నారు.

