అసలు దొంగలను కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం?
నిమ్మకు నీరు ఎత్తినట్లు పోలీస్ అధికారుల వ్యవహారం?
పోలీసు విచారణలో అసలు ఏం జరుగుతోంది?
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు మున్సిపాలిటీ మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం దొంగతనం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దొంగతనానికి పాల్పడిన కొంతమందిని నాలుగైదు రోజుల అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ విచారణపై కొందరు ప్రజలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వమా….? పోలీస్ అధికారులా…? దొంగతనానికి కారణమైన బడ దొంగలను కాపాడుతున్న ప్రజల తమ ఆవేదనకు గురి అవుతున్నారు. మేము కష్టపడి వరి ధాన్యం పండిస్తే ఆ పండించిన పంటకు ఫలితం లేకుండా చేసిన దొంగల ముఠాను కస్టడికి పంపాల్సింది పోయి. వారికి కాపు కాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీస్ అధికారులు. న్యాయం చేయవలసిన వారే? దొంగలను కాపాడుతున్నారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్పందించి అసలు దొంగలను కస్టడీకి పంపవలసిందిగా ప్రజలు వేడుకుంటున్నారు.

