బెజ్జంకి, ఆగస్టు 25 (ప్రజావాణి)
బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
**ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరాటం**
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కరివేద మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించే పోరాటానికి బీజేపీ శ్రేణులతో కలిసి తరలివెళ్తున్నట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.
**ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం**
విద్యార్థుల హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు తెలిపారు. సాయిని మల్లేశంకు ఘన స్వాగతం పలికిన కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆడిచర్ల రాజు, బీజేవైఎం నాయకులు సంఘ నరేష్, విమల్ కుమార్, గుంజేటి శివకుమార్, రావుల రాజిరెడ్డి, బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షులు గైని రాజుతో పాటు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

