నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల విషయంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ధర్నా సందర్భంగా చేసిన వ్యాఖ్యలను చండూర్ మున్సిపల్ చైర్మన్ రాద్ధాంతం చేయడం సరికాదని టీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఇరిగి రామన్న మాట్లాడుతూ రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రభాకర్‌రెడ్డిని గౌరవం, మర్యాద లేకుండా చైర్మన్ మాట్లాడటం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను రాజకీయంగా ఎదుర్కోవాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. అలాగే పార్టీ ఇన్‌చార్జిని మార్చాలంటూ మాట్లాడటం కూడా సమంజసం కాదని అన్నారు. రాజకీయ ప్రయాణంపై విమర్శలు చేయడం జరిగింది, డబ్బులు పెట్టి మున్సిపల్ చైర్మన్ పదవి పొందారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గౌస్ మోహన్ పాల్గొన్నారు.

