ప్రజావాణి, సిద్దిపేట, ఆగస్టు 23:
శ్రీ సరస్వతి శిశుమందిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిద్దిపేట విభాగ్ స్థాయి గణిత విజ్ఞాన మేళా ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వంగ రాజేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గణితం, విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు నాంది పలకవచ్చన్నారు. పుస్తక జ్ఞానంతో పాటు ఆలోచనా శక్తి, సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈరోజు మీరు నేర్చుకునే ప్రతి కొత్త విషయం.. రేపటి మీ విజయానికి పునాది. లక్ష్యాన్ని నిర్దేశించుకుని, కష్టపడి చదివి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు” అని విద్యార్థులకు ఆయన ప్రేరణనిచ్చారు.విద్యార్థులు ప్రదర్శించిన గణిత, విజ్ఞాన నమూనాలను పరిశీలించిన వంగ రాజేశ్వర్ రెడ్డి గారు వారిని అభినందించి, మరింత ఉన్నత స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి విజ్ఞాన మేళాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షులు తడకమట్ల ఈశ్వరయ్య గారు శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ అధ్యక్షుడు కొమురవెల్లి శేఖరం గారు శ్రీ సరస్వతి శిశు మందిర్ సిద్దిపేట్ అధ్యక్షులు పెద్ది వైకుంఠం గారు శ్రీ సరస్వతి శిశు మందిర్ సిద్దిపేట కార్యదర్శి శ్రీ బొంతపల్లి శ్రీనివాసరావు గారుమరియు శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోత్కు నరేష్ కుమార్ గారు పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

