
కోదాడ పట్టణానికి రూ.258 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని, పట్టణానికి మహర్దశ పట్టనుందని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటిస్తున్నప్పటికీ.. 16వ వార్డులో జరుగుతున్న మురుగు కాలువ పనుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మురుగు కాలువ పనుల్లో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయని, సుమారు 100 మీటర్ల మేర చేపట్టాల్సిన కాలువ పనులు పది రోజులు గడుస్తున్నా ముందుకు సాగడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పనులు నత్తనడకన సాగుతుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.ఇళ్లకు చేరుకోవాలంటే గుంతలు, నిర్మాణ సామగ్రి మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ప్రజా సొమ్ముతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు, పనులను వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి 16వ వార్డులో నిలిచిపోయిన కాలువ పనులను పరిశీలించి, నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వార్డు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
*కోదాడలో రూ.258 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు.. 16వ వార్డులో మాత్రం నత్తనడక*.
RELATED ARTICLES

