📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్రెడ్ క్రాస్ సొసైటీ, తలసీమియా రోగుల రవాణా, రక్తదాన శిబిరాల నిర్వహణకు రూ.20 లక్షల విలువైన...

రెడ్ క్రాస్ సొసైటీ, తలసీమియా రోగుల రవాణా, రక్తదాన శిబిరాల నిర్వహణకు రూ.20 లక్షల విలువైన వాహనం అందజేత

📰 Generate e-Paper Clip



అనంతపురం బ్యూరో ఆగస్టు 20 నేటి శుభోదయ
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో తలసీమియా వ్యాధిగ్రస్తుల రవాణా సౌకర్యంతో పాటు రక్తదాన శిబిరాల నిర్వహణకు ఉపయోగపడే రూ.20 లక్షల విలువైన టెంపో ప్రయాణ వాహనాన్ని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దాత శ్రీ శంకర్ నారాయణ ప్లాంజరీ బహూకరించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ వాహనాన్ని సేవా కార్యక్రమాలకు అంకితం చేశారు.ఈ వాహనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఏ. మలోలా, జేఎన్టీయూ అనంతపురం ఉపకులపతి ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు, వాహన దాత శ్రీ శంకర్ నారాయణ ప్లాంజరీ, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ గజ్జల లక్ష్మణ ప్రసాద్, వైస్ చైర్మన్ డాక్టర్ గీతా బాల, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు బిసాతి భరత్, రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు,ఉప కమిటీ సభ్యులు, వాలంటీర్లు, రక్తదాన శిబిరాల నిర్వాహకులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాహన దాత  శంకర్ నారాయణ ప్లాంజరీ మాట్లాడుతూ, డాక్టర్ గీతా బాల ద్వారా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖలో తలసీమియా డే కేర్ సెంటర్ ప్రారంభించబడిందని, తలసీమియా వ్యాధిగ్రస్తుల అవసరాల కోసం ఒక వాహనం అవసరమని తనకు తెలియజేయడంతో వెంటనే స్పందించి వాహనానికి అవసరమైన నిధులను సమకూర్చినట్లు తెలిపారు.రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసిన అనంతరం తనకు ఎంతో సంతోషం కలిగిందని, తాను అందించిన విరాళం సక్రమంగా ప్రజాసేవకు వినియోగించబడుతోందనే పూర్తి విశ్వాసం కలిగిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రెడ్ క్రాస్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.అదేవిధంగా, అనంతపురంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐ బ్యాంక్ సేవల్లో కూడా భాగస్వామి కావాలనే తన ఆకాంక్షను శ్రీ శంకర్ నారాయణ ప్లాంజరీ వ్యక్తం చేశారు. తన భార్య స్వర్గీయ  రాజ్యలక్ష్మి ప్లాంజరీ ఇటీవల నేత్రదానం చేశారని, వారి నేత్రాలను ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి కి దానం చేసినట్లు తెలిపారు. ఇలాంటి నేత్రదాన సదుపాయం అనంతపురంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.అనంతపురం రెడ్ క్రాస్ ఐ బ్యాంక్‌లో కార్నియాలను శాస్త్రీయంగా పరిశీలించి, అవసరమైన వారికి అందించేందుకు ఉపయోగపడే స్పెక్యులర్ మైక్రోస్కోప్ కొనుగోలుకు అవసరమైన సుమారు రూ.40 లక్షల వ్యయాన్ని తానే భరిస్తానని ఈ సందర్భంగా  శంకర్ నారాయణ ప్లాంజరీ హామీ ఇచ్చారు.దాత శ్రీ శంకర్ నారాయణ ప్లాంజరీ అందించిన ఈ సహకారంపై రెడ్ క్రాస్ జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు రెడ్ క్రాస్ సంస్థతో పాటు సమాజం కూడా ఎంతో రుణపడి ఉంటుందని పేర్కొంది. స్పెక్యులర్ మైక్రోస్కోప్ అందుబాటులోకి వచ్చిన అనంతరం సేకరించిన కార్నియాలను శాస్త్రీయంగా పరీక్షించి, ముందుగా స్థానికంగా అవసరమైన వారికి అందించడంతో పాటు, అవసరానికి అనుగుణంగా హైదరాబాద్‌లోని ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, అగర్వాల్ నేత్ర హాస్పిటల్ తదితర ప్రముఖ నేత్ర వైద్య సంస్థలకు పంపించే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ వాహనం ద్వారా తలసీమియా వ్యాధిగ్రస్తులకు రక్త మార్పిడి కోసం అవసరమైన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు, జిల్లాలో నిర్వహించే రక్తదాన శిబిరాలకు అవసరమైన సామగ్రి, సిబ్బంది  ఇతర సేవలను సమర్థవంతంగా తరలించేందుకు ఉపయోగపడనుంది. దీంతో అనంతపురం జిల్లాలో తలసీమియా రోగులకు, రక్తదాన శిబిరాల నిర్వహణకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.కార్యక్రమంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రక్తదాన శిబిరాల నిర్వాహకులు, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.