రెడ్ క్రాస్ సొసైటీ, తలసీమియా రోగుల రవాణా, రక్తదాన శిబిరాల నిర్వహణకు రూ.20 లక్షల విలువైన వాహనం అందజేత
అనంతపురం బ్యూరో ఆగస్టు 20 నేటి శుభోదయ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో తలసీమియా వ్యాధిగ్రస్తుల రవాణా సౌకర్యంతో పాటు రక్తదాన శిబిరాల నిర్వహణకు ఉపయోగపడే రూ.20 లక్షల విలువైన టెంపో ప్రయాణ వాహనాన్ని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దాత శ్రీ శంకర్ నారాయణ ప్లాంజరీ బహూకరించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ వాహనాన్ని సేవా కార్యక్రమాలకు అంకితం చేశారు.ఈ వాహనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఏ....