📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriగురుకుల్ కళాశాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు...టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి, ఎండోమెంట్ కరస్పాండెంట్ తేజకు...

గురుకుల్ కళాశాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు…టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి, ఎండోమెంట్ కరస్పాండెంట్ తేజకు ఘన సన్మానం…

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, ఆగస్టు 20 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని గురుకుల్ కళాశాలలో గురుకుల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శనివారం గురుకుల్ కళాశాలలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంపై సభ్యులు విస్తృతంగా చర్చించి, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పలు ముఖ్యమైన తీర్మానాలు చేశారు.

ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా టీజేఏసీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మారం లక్ష్మారెడ్డిని, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎండోమెంట్ కరస్పాండెంట్ తేజను గురుకుల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, జేఏసీ చైర్మన్ మారం లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీలు మేకల నర్సింగ్ రావు, దీకొండ రఘు, సహకార బ్యాంకు డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు బచ్చు నగేష్ కుమార్ గుప్తా, కందకట్ల మాధవరెడ్డి, భోగ అర్జున్, సుదర్శన్ రెడ్డి, మంగు శ్రీనివాస్, సారా శ్రీనివాస్ గౌడ్ చిన్న, ఎం.ఏ. ఖలీల్, రవిశంకర్, ఎం.డి. నజీర్, లక్ష్మయ్య, ఎండోమెంట్ కరస్పాండెంట్ తేజ, ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి, ఎం.డి. సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.