గురుకుల్ కళాశాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు…టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి, ఎండోమెంట్ కరస్పాండెంట్ తేజకు ఘన సన్మానం…
ఘట్‌కేసర్, ఆగస్టు 20 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని గురుకుల్ కళాశాలలో గురుకుల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శనివారం గురుకుల్ కళాశాలలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంపై సభ్యులు విస్తృతంగా చర్చించి, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పలు ముఖ్యమైన తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా టీజేఏసీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మారం లక్ష్మారెడ్డిని, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎండోమెంట్ కరస్పాండెంట్ తేజను గురుకుల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కళాశాల అభివృద్ధికి...