📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriరాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం గరిసెల సురేందర్ ముదిరాజ్

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం గరిసెల సురేందర్ ముదిరాజ్

📰 Generate e-Paper Clip

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం గరిసెల సురేందర్ ముదిరాజ్

గుండ్ల పోచంపల్లి, 299 డివిజన్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్ల పోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం గౌడవల్లిలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి గరిసెల సురేందర్ ముదిరాజ్‌తో పాటు మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాలకుర్తి మురళి గౌడ్, దాసరి శంకర్ యాదవ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గరిసెల సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన ఎంతో ముందుచూపుతో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

దేశం కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని, ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని సురేందర్ ముదిరాజ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్, గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్, శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు గడిల కృష్ణారెడ్డి, గుండ్ల పోచంపల్లి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరంగవరం నవీన్ ముదిరాజ్, INTUC జిల్లా నాయకులు కావేరి శేఖర్ ముదిరాజ్, సేవాదళ్ అధ్యక్షులు చిల్ల సాయి ముదిరాజ్, NSUI జిల్లా నాయకులు గడిల రాఘవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు, సుతారిగూడ మాజీ ఉపసర్పంచ్ చిల్ల వెంకటేష్ ముదిరాజ్, కందాడి రవీందర్ రెడ్డి, చిన్ని కృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.