📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriరాజీవ్ గాంధీ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం

రాజీవ్ గాంధీ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం

📰 Generate e-Paper Clip

*రాజీవ్ గాంధీ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం*

– ఆర్టీఏ మెంబర్ బీమిడి జైపాల్ రెడ్డి

మేడ్చల్, అక్షిత ప్రతినిధి :
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేడ్చల్ జిల్లా ఆర్టీఏ మెంబర్ బీమిడి జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శామీర్‌పేట్ డివిజన్ దేవరయాంజాల్‌లో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, పలువురు నాయకులు కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశాన్ని ఆధునికత, సాంకేతిక రంగాల వైపు నడిపించడంలో రాజీవ్ గాంధీ గారు కీలక పాత్ర పోషించారని అన్నారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించడంతో పాటు, దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన దూరదృష్టి కలిగిన నాయకుడిగా రాజీవ్ గాంధీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ తిరుపతి శంకర్ గౌడ్, శ్రీ సీతారామ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పేండం లక్ష్మినారాయణ, మాజీ ధర్మకర్తలు ఎల్లెంకి భారతి, వలందాసు మురళి గౌడ్, నానిగళ్ళ హరిగోపాల్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పిన్నింటి ధర్మారెడ్డి, సుతారిగూడెం దుర్గయ్య, కాంగ్రెస్ నాయకులు మిర్యాలకర్ సాయి కుమార్, నానిగళ్ళ శ్రీనివాస్, గ్యారాల ప్రవీణ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కత్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.