📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadకోటగిరిలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో.

కోటగిరిలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో.

📰 Generate e-Paper Clip

కోటగిరిలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో.

రాష్ట్ర ప్రభుత్వం జీవో 97 రద్దు చేయాలని డిమాండ్.

ఈ జీవో వల్ల లక్షలాది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ ప్రమాదం.

పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు.

 

కోటగిరి/ప్రజావాణి:-తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో 97 ద్వారా రాష్ట్రంలోని లక్షలాదిమంది పాలిటెక్ని క్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని పీడిఎ స్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు ఆరోపించారు. బుధవారం పిడిఎస్యు,డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కోటగిరి పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి వారు ర్యాలీగా వచ్చి మండల కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, నిజామాబాద్ జిల్లా డిఎస్ఎఫ్ఐ అధ్యక్షులు జీవన్ రాథోడ్ మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం యాంగ్ ఇండియా ఇంటిగ్రె టెడ్ స్కిల్ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నీక్ డిప్లమా విద్యార్థులను శక్తి పాలసీలో కలుపుతూ ఐటిఐతో సమానం గా ఉంచలని జీవో 97 ను ముందుకు తీసుకురావడం పాలిటెక్నిక్ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ కోర్సును ప్రత్యేక కోర్సుగా చూడాలని.పాలిసెట్ ద్వారా 3 సంవత్సరాలు టెక్నికల్ కోర్సు చేసే విద్యార్థులను మిగతా కోర్సులతో సమానంగా చూడ కూడదని డిమాండ్ చేశారు.గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు లక్షలాదిగా నిరసనలు చేపడుతున్నారని తెలిపారు. విద్యార్థుల ఆవేదనకు అనుగుణంగానే నేడు విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని అన్నారు.ఎస్బిటిఇటి ను బలోపేతం శక్తి పాలసీ ని వెనక్కి తీసుకోవాలని ఈ జీవో నెంబర్ 97 ను వెంటనే రద్దు చేయా లని లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్బంగా వారు ప్రభుత్వన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు,నిజామాబాద్ జిల్లా డిఎస్ఎఫ్ఐ అధ్యక్షులు జీవన్ రాథోడ్,నిజామాబాద్ జిల్లా పిడిఎస్యు నాయకులు సాయికుమార్,డిఎస్ఎఫ్ఐ నాయకులు జాదవ్ ప్రణయ్,సామాజిక సేవ కార్యకర్త తోట శ్రీకాంత్,బోధన్ డివిజన్ పిడిఎస్యు నాయకులు ఉదయ్, పాలిటెక్నిక్ విద్యార్థిని,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.