అన్నోజిగూడ దివ్యాంగుల కాలనీలో ఘనంగా బోనాల వేడుకలు…
అశేష భక్తజన సందోహం.. పూనకాలతో అమ్మవార్లకు బోనాలు సమర్పించిన భక్తుల
ఘట్కేసర్, ఆగస్టు 16: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా, జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ ఘట్కేసర్ సర్కిల్ పోచారం వార్డు పరిధిలోని అన్నోజిగూడ దివ్యాంగుల కాలనీలో ఆదివారం బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అర్బన్ లోకల్ బాడీస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
వేడుకల సందర్భంగా కాలనీలో అశేష భక్తజన సందోహం నెలకొంది. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను నెత్తిన ఎత్తుకుని అమ్మవార్లకు సమర్పించగా, పలువురు భక్తులు పూనకాలతో అమ్మవారిని కొలిచారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవార్లకు బోనాలు, తీర్థప్రసాదాలు సమర్పించారు. దీంతో దివ్యాంగుల కాలనీ అంతా భక్తి పారవశ్యంతో మార్మోగింది.
శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కుటుంబాల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు సహా కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల వేడుకలను విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఆకుల లింగమల్లు, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల జేఏసీ నాయకుడు మొక్క ఉపేందర్, మహిళా అధ్యక్షురాలు మీసాల లక్ష్మి, మైసయ్య, ఎస్.కె. అన్వర్ పాషా, భూతం అరుణ, పూజిత, మౌనిక, మండవ గోపి, సీనియర్ నాయకులు చేపూరి కృష్ణయ్య, మాదారపు పూలమ్మ, ప్రభాస్ (మహేష్), వెంకటేష్, బి. రాజు గౌడ్, కొల్పుల సంతోష్, అశోక్, ఎస్.కె. మౌలానా, మండల పద్మ, వనిత, అనిత, వెంకటేష్ గొల్ల, ఎలగొండ బిక్షపతి, మర్రి రమణమ్మ, బాలమణి, బొడ్డు సుమలత తదితరులు పాల్గొన్నారు.
కాలనీవాసులంతా ఐక్యంగా పాల్గొని అమ్మవార్లకు బోనాలు సమర్పించడం, మొక్కులు చెల్లించుకోవడంతో వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిశాయి.

