📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘనంగా దేవేందర్ నగర్ కాలనీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఘనంగా దేవేందర్ నగర్ కాలనీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip



పాల్గొన్న నాయకులు, కాలనీ వాసులు

జెండా ఆవిష్కరించిన కాలనీ అధ్యక్షుడు మైల నర్సింహ్మా

మేడిపల్లి ఆగస్టు 15( మన ప్రజావాణి)స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బోడుప్పల్ సర్కిల్ లోని దేవేందర్ నగర్ కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు మాజీ కార్పొరేటర్,బోడుప్పల్ డివిజన్ అధ్యక్షుడు బోమ్మక్ కళ్యాణ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సాలమ పవన్ రెడ్డి,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోనె శ్రీనివాస్,సిపిఐ పార్టీ మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చ కిషన్, బోడుప్పల్ బిజెపి అధ్యక్షుడు తలారి రవి యాదవ్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు మైల నర్సింహ్మా జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ మేరకు వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని,వారి త్యాగాలు,దేశ ప్రజల సంఘటిత పోరాట ఫలితంగానే స్వాతంత్రం సిద్దించిందని అన్నారు.
దేశంలో కుల,మత,ప్రాంత బేధాలు ఉండవద్దని,దేశ ప్రజలందరికి సమాన హక్కులు అవకాశాలు ఉండాలని తెలిపారు.
అసమానతలు లేని సమాజం నిర్మాణం కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని మనకు అందించాని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదిముల కరుణాకర్, విష్ణు గౌడ్,తిరుమలేష్, కాలనీ ప్రధాన కార్యదర్శి బోడగళ్ళ సదానంద్, కోశాధికారి మరాటి మత్స్యగిరి,ఉపాధ్యక్షుడు దండు రమేష్,కుక్కల చంద్రయ్య,జోగు మల్లయ్య,బండ బిరప్ప,
మల్ల క్రిష్ణ,కుక్కల స్వామి,
కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.