📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliజన్మదినం వేళా సందర్భంగా సేవా కార్యక్రమం

జన్మదినం వేళా సందర్భంగా సేవా కార్యక్రమం

📰 Generate e-Paper Clip



-క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్.

రామగిరి,మన సమగ్ర ప్రజావాణి ఆగస్టు 15

లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో 320 జి డిస్ట్రిక్ట్ ఐదవ రీజినల్ చైర్మన్ లయన్ కావేటి రాజగోపాల్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సెంటినరీ కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేద మహిళా కుటుంబానికి నిత్యావసర సరుకులను క్లబ్ ప్రతినిధులు అందజేశారు.
అనంతరం క్లబ్ అధ్యక్షురాలు డా.శరణ్య యాదవ్ మాట్లాడుతూ… జన్మదిన వేడుకలను కేవలం వ్యక్తిగత సంబరాలకే పరిమితం చేయకుండా, అవసరంలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని అన్నారు.ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంతగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి టీవీ సురేష్ బాబు,క్లబ్ చైర్మన్లు మోల్మురి  శ్రీనివాస్,గంట వెంకటరమణ రెడ్డి,బత్తుల శంకర్,రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.